హైందవ సాంప్రదాయంలో గోమాతకు ఉన్న ప్రాధాన్యత తెలిపేలా... జగిత్యాలలో లేగ దూడకు నామకరణ వేడుక జరిపారు. వేద పండితుడు చిరంజీవి ఒద్దిపర్తి సంజయ్ ఆచార్య ఆధ్వర్యంలో... జగిత్యాల పోచమ్మవాడలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
లేగదూడకు నామకరణం.. ఊయలలో ఊపుతూ లాలిపాట - jagtial news updates
జగిత్యాలలో లేగదూడకు ఘనంగా నామకరణం చేశారు. గోమాతకు ఉన్న ప్రాధాన్యత తెలిపేలా కార్యక్రమం నిర్వహించారు. లేగదూడకు బృందావన అని పేరు పెట్టారు.
![లేగదూడకు నామకరణం.. ఊయలలో ఊపుతూ లాలిపాట A grand naming ceremony for Calf in Pochamma Wada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11371720-34-11371720-1618207628341.jpg)
లేగదూడకు నామకరణం.. ఊయలలో ఊపుతూ లాలిపాట
పెంచుతున్న గోమాతకు జన్మించిన లేక దూడకు 21వ రోజున... అచ్చం పిల్లల నామకరణం వేడుకలాగే ఈ వేడుక జరిపారు. ఉయ్యాలలో లేగదూడను ఉంచి లాలిపాట పాడారు. గోపూజ నిర్వహించిన అనంతరం.. దూడకు 'బృందవన' నామకరణం చేశారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్న పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైందవ సాంప్రదాయంలో గోమాత విశిష్టతను ప్రతి ఒక్కరూ... ఇప్పటికైనా గ్రహించాలని... సంజయ్ ఆచార్య కోరారు.
లేగదూడకు నామకరణం.. ఊయలలో ఊపుతూ లాలిపాట