తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. రూపాయి రూపాయి లెక్కెట్టుకుని బతికే వారికి కొండంత కష్టం వచ్చింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఉన్నతందా ఊడ్చిపెట్టి నాలుగేళ్లుగా వైద్యం చేయించారు. ఇప్పుడు కనీస వైద్యం చేయించలేక... భర్త అవస్థను చూడలేక సాయంకోసం దీనంగా ఎదురుచూస్తోంది జగిత్యాలకు చెందిన ఓ పేద కుటుంబం.

a famaly request for Financial Help to Treatment of Kidney Failure
సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం

By

Published : Dec 22, 2019, 10:57 AM IST

Updated : Dec 22, 2019, 4:41 PM IST

'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'

కూలికి వెళ్తేగాని పూట గడవని ఆ కుటంబానికి పెద్ద కష్టం వచ్చింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు పాడై మంచం పట్టాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన భర్తను రక్షించుకోవాలన్న తపనతో వైద్యానికి లక్షలు వెచ్చించారు. అయినా పూర్తిగా కోలుకోలేదు. కనీస వైద్యం చేయించడానికి చేతిలో చిల్లగవ్వలేక... ఉదార మనసు కలిగిన దాతల కోసం ఆమె ఎదురుచూస్తోంది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పెంట రాజయ్యది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల కిందట రాజయ్యకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. అప్పటి నుంచి ప్రైవేటు వైద్యశాలలో డయాలసిస్ చేస్తూ ఉన్నదంతా ఊడ్చి ఖర్చుపెట్టారు. ఇప్పుడు కనీసం వైద్య ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక... రోజురోజుకూ దిగజారుతున్న భర్త ఆరోగ్యాన్ని చూడలేక ఆమె పడుతున్న మనోవేదన వర్ణణాతీతం.

రాజయ్య భార్య లక్ష్మి కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్తకు వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతోంది... మనసున్న మారాజులు ఎవరైనా సాయం అందిస్తే.. తన భర్త ప్రాణం నిలబెట్టినవారవుతారని అశృనయనాలతో అర్థిస్తోంది.

ఇదీ చూడండి: ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

Last Updated : Dec 22, 2019, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details