జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో నివాసముండే సున్నం బ్రహ్మయ్య వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని వినూత్నంగా ఆలోచించాడు. కర్రతో గణపయ్యను తయారు చేసి.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఎలా చేశాడంటే...
ఒక టేకు మొద్దును తీసుకొని.. దానికి ఎలాంటి అతుకులు లేకుండా.. అందమైన వినాయక రూపాన్ని తీర్చిదిద్దాడు. గణపయ్య ప్రతిమతో పాటు చేతిలో ఉండే లడ్డూ, ఎలుకను సైతం కర్రతోనే తయారు చేశాడు. భక్తులను ఆకట్టుకునేలా అద్దాల మేడను ఏర్పాటు చేసి.. అందులో గణపయ్యను ప్రతిష్టించాడు. బ్రహ్మయ్య ఇంటి ఆవరణలో వెలసిన ఈ కర్ర గణపతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.