తెలంగాణ

telangana

ETV Bharat / state

దూడకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. కోమాలోకి! - boy went into coma

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. దూడకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారుడి వైద్యం కోసం సాయం అందించాలని బాధితుడి తల్లి విజ్ఞప్తి చేస్తోంది.

boy went into coma
కోమాలోకి వెళ్లిన బాలుడు

By

Published : May 16, 2021, 10:46 PM IST

దూడకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో చోటుచేసుకుంది. శేకెళ్లకు చెందిన సాలవ్వ కుమారుడు సురేశ్(9) ఇంటి వద్ద కట్టేసిన దూడకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. నీళ్ల కోసం దూడ అటు ఇటు కదలడంతో.. దాని మెడకు కట్టి ఉన్న తాడు ప్రమాదవశాత్తు బాలుడి నడుముకు చుట్టుకుంది.

దూడ పరుగుతీస్తూ కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో.. సురేశ్​ తలకు తీవ్ర గాయమైంది. బాధితుడిని కరీంనగర్​లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స జరిపిన వైద్యులు బాలుడు కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. తండ్రి లేని సురేశ్​ను.. తల్లి సాలవ్వ కూలీ పని చేస్తూ చదివిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారుడి వైద్యం కోసం సాయం అందించాలని దాతలను విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి:కరోనా లేని గ్రామం ఎక్కడుందో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details