తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో ఒక్కరోజే 546 కరోనా పాజిటివ్ - తెలంగాణ వార్తలు

జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 546 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. జిల్లావ్యాప్తంగా పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. మెట్‌పల్లి పట్టణంతోపాటు మండలంలో ఒకేరోజు 174 కేసులు బయటపడగా కోరుట్ల పట్టణంతోపాటు మండలంలో 42 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

546-new-corona-cases-registered-in-jagital-and-7-died
జగిత్యాల జిల్లాలో ఒక్కరోజే 546 కరోనా పాజిటివ్

By

Published : Apr 13, 2021, 7:29 AM IST

జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సోమవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 546 మందికి కొవిడ్‌ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 3వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్న కోరుట్ల, మెట్‌పల్లి, కొండ్రికర్ల తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ రవి పర్యటించారు. కరోనా నిబంధనల అమలు తీరు పరిశీలించారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్​మెంట్‌ జోన్లుగా గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 గ్రామాలను కంటైన్​మెంట్‌ జోన్లుగా గుర్తించారు.

జిల్లాలో కలెక్టర్ పర్యటన

మరోవైపు పాజిటివ్‌ వచ్చిన వారు కచ్చితంగా గృహా నిర్బంధంలోనే ఉండాలని, సరైన వసతులు లేని వారిని కొండగట్టు జేఎన్‌టీయూ ఐసోలేషన్‌కు తరలించాలని కలెక్టర్‌ రవి సూచించారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారిని జిల్లా ఆస్పత్రికి తరలించాలన్నారు. కంటైన్​మెంట్‌ జోన్లలో అవసరమైన వారికి నిత్యావసరాలను ఇళ్ల వద్దకు పంపించాలని పేర్కొన్నారు. కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కొండ్రికర్ల గ్రామంలో ద్విచక్రవాహనంపై మాస్కు లేకుండా వెళ్తున్న యువకులను కలెక్టర్‌ స్వయంగా ఆపి రూ.1000 జరిమానా విధించారు. వ్యాధి బారిన పడి హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:పలు ప్రాంతాల్లో స్పైషల్‌ డ్రైవ్స్‌... మాస్కు ధరించని వారికి జరిమానాలు

ABOUT THE AUTHOR

...view details