జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మక్కలను దించేందుకు హమాలీలు లేక 4 రోజులుగా లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. కొడిమ్యాల మండలం చెప్యాల ఎక్స్‌రోడ్డు వద్ద 50 లారీలు నాలుగు రోజులుగా రోడ్డుపైనే ఉంటున్నాయి. మెట్‌పల్లిలో కొనుగోలు చేసిన మక్కలను పూడురు సమీపంలో గౌరపూర్ వద్దున్న గోదాంలో దింపాల్సి ఉంది.
హమాలీల కొరత... 4 రోజులుగా రోడ్డుపైనే 50 లారీలు - LOCK DOWN EFFECTS
లాక్‌డౌన్ కారణంగా 50 లారీలు నాలుగు రోజులుగా జగిత్యాల జిల్లా చెప్యాల ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపైనే నిలిచిపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించేందుకు హమాలీలు లేకపోవటం వల్ల చేసేదేమిలేక రోడ్డు మీదనే నిలిపి ఉంచినట్లు లారీ డ్రైవర్లు తెలిపారు.
హమాలీల కొరత... 4 రోజులుగా రోడ్డుపైనే 50 లారీలు
లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి హమాలీలు రాకపోవటం.. స్థానికంగా ఉన్న హమాలీలు సరిపోకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా డ్రైవర్లు లారీల కిందనే సేదతీరుతున్నారు. అన్నపానియాలు లేక నీరసించి పోతున్నామని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.