జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. హనుమాన్‌నగర్, దుబ్బవాడ, మార్కెట్ రోడ్ ప్రాంతాలకు చెందిన ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
మెట్పల్లిలో కరోనా కలవరం.. ఐదుగురికి వైరస్ - metpally corona cases news
రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య.. కొన్ని రోజులుగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
![మెట్పల్లిలో కరోనా కలవరం.. ఐదుగురికి వైరస్ 5 corona cases at metpally in jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11099014-73-11099014-1616324408607.jpg)
మెట్పల్లిలో కరోనా కలవరం.. ఐదుగురికి వైరస్
ఫలితంగా అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుల ఇళ్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి పాటించాలని సూచించారు. గుంపులు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:గురుకులంలో కరోనా కలకలం.. మొత్తం 26 మందికి పాజిటివ్