జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. జిల్లాలో సోమవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో చేసిన రాపిడ్ పరీక్షల్లో 28 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వరంగల్, కరీంనగర్ పరీక్షా కేంద్రాల్లో మరో 14 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 500కు చేసింది.
జగిత్యాల జిల్లాలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు - జగిత్యాలలో కొవిడ్ కేసులు
జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో ఇవాళ 42 కరోనా పాజిటివ్ కేసులు
ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కాగా.. రాబోయే రోజుల్లో మరింత మంది కొవిడ్ బారిన పడే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు. రోజురోజుకు మహమ్మారి విజృంభణతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీచూడండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్