తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీకాలనీలో కరోనా కలకలం రేగింది. 70 మందికి పరీక్షలు చేయగా.. 40 మందికి కరోనా నిర్ధరణయింది. వీరంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు. ఇక్కడు కేసులు పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి ఇంత మందికి కరోనా రావటంతో ఆ ఊరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్కులు ధరించకపోవడం వల్లే కొవిడ్ వేగంగా వ్యాప్తిం చెందుతోందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా.. రెండు గ్రామాల్లోనే 74 కేసులు
రాష్ట్రంలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాలలో 40 మందికి కరోనా సోకింది. నిర్మల్ జిల్లాలో 34 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
కరోనా
నిర్మల్ జిల్లాలో కూడా కరోనా విజృంభిస్తోంది. సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్‌లో 75 మందికి కరోనా పరీక్షలు చేయగా 34 మంది పాజిటివ్ వచ్చింది. గోపాల్‌పేట్‌లో మూడ్రోజుల్లోనే 70 మందికి కరోనా నిర్ధరణయింది. దీంతో గోపాల్‌పేట గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్నారు.
ఇదీ చదవండి:ఆర్టీపీసీఆర్ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి
Last Updated : Apr 8, 2021, 9:18 PM IST