జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 4 కేసులు నమోదయినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. ధర్మపురి మండలంలో ఒకరికి, ఇబ్రహీంపట్నం మండలంలో ముగ్గురికి కరోనా సోకినట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మరో 4 కరోనా కేసులు - corona updates
రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో జగిత్యాల జిల్లా ఆందోళనకరంగా మారింది. ఈరోజు మరో నలుగురికి పాజిటివ్‌గా తేలగా... మొత్తం కేసులు 68 గా అధికారులు వెల్లడించారు.
జగిత్యాల జిల్లాలో మరో 4 కరోనా కేసులు నమోదు
నలుగురు బాధితులు ముంబయి నుంచి వచ్చిన వారేనని అధికారులు గుర్తించారు. బాధితులందరినీ గాంధీకి తరలిస్తున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 68 కేసులు నమోదయ్యాయి.