జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆగస్టు 24న కొత్తగా 273 మందికి పాజిటివ్ రాగా.. మరో ఇద్దరు మృతి చెందారు. మూడు రోజుల్లోనే 732 మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది.
జగిత్యాల జిల్లాలో ఒకేరోజు 273 కరోనా కేసులు - jagtial latest corona news today
జగిత్యాల జిల్లాలో ఆగస్టు 24న కొత్తగా 273 కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మొత్తం కొవిడ్ బాధితులు 2,319కు చేరుకున్నారు. రోజుకు 200కు పైగా పాజిటివ్ కేసులు వస్తుండటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
జగిత్యాల జిల్లాలో ఒకేరోజు 273 కరోనా కేసులు
మొత్తం ఇప్పటి వరకు 2319 కేసులు నమోదు కాగా.. 18 మంది మృతి చెందారు. కొవిడ్ బారిన పడిన వారిలో ప్రజా ప్రతినిధులు, అధికారులున్నారు. ప్రతిరోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి :'ఓరుగల్లును కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం'