తెలంగాణ

telangana

ETV Bharat / state

266 చక్రాల వాహనం... అందరి ఫోన్లలో నిక్షిప్తం - 266 tyres vehical

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వద్ద ఓ భారీ వాహనం నిలిచిపోయింది. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏమిటో ఆ వాహనం ప్రత్యేకత అనుకుంటున్నారా... ఈ బండికి 266 చక్రాలున్నాయి మరి.

266 చక్రాల వాహనం

By

Published : Mar 20, 2019, 3:27 PM IST

266 చక్రాల వాహనం
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో 266 చక్రాల భారీ వాహనం నిలిచిపోయింది. గత మూడు నెలలుగా గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్​ నుంచి ముంబయి మీదుగా కరీంనగర్​ జిల్లా రామగుండం ఎన్టీపీసీకి భారీ పరికరాన్ని తరలిస్తున్నారు. మెట్​పల్లి పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైలెవల్​ వంతెన వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నందున వాహనం నిలిపేశారు. 266 చక్రాలున్న ఈ వాహనాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించి తమ చరవాణుల్లో బంధించారు.

ABOUT THE AUTHOR

...view details