తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో కాంగ్రెస్‌ నాయకుడిపై 20 మంది దాడి - attack on Congress leader in Metpalli latest news

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20 Members attack on Congress leader in Metpalli, Jagittala District
కాంగ్రెస్‌ నాయకుడిపై 20మంది దాడి

By

Published : Oct 25, 2020, 9:14 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కాంగ్రెస్ నాయకుడు లింగారెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం లింగారెడ్డి తన ఇంటి సమీపంలో కూర్చొని ఉండగా 20 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వల్ల వైద్యులు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు.

కాంగ్రెస్‌ నాయకుడిపై 20మంది దాడి

ఇవీచూడండి:పండగ పూట విషాదం... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details