తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాటుకు పక్షంలోపే అన్నదమ్ములిద్దరు బలి - కరోనా కాటు

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలు మిగులుస్తోంది. ఎంత వేగంగా వ్యాపిస్తోందో... అంతే వేగంగా పలువురి ప్రాణాలు బలిగొంటోంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలం స్తంభంపల్లిలో మహమ్మారి ధాటికి... పక్షంలోపే ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు విడిచారు.

2 brothers died with corona in stambampally
2 brothers died with corona in stambampally

By

Published : May 1, 2021, 7:28 PM IST

పదమూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరు కరోనా కాటుకు బలైన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకుంది. జగిత్యాలలో న్యాయవాదిగా పని చేస్తున్న గొంటి గోపాల్ ఏప్రిల్ 19న కరోనా బారినపడి మృతి చెందాడు.

ఉళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గోపాల్ తమ్ముడు సతీశ్​కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వెంటనే కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి సతీశ్​ను తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. యుక్త వయసులో ఉన్న అన్నదమ్ములిద్దరు మరణించడం వల్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: 'కొవిడ్​ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'

ABOUT THE AUTHOR

...view details