తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి : జడ్పీ ఛైర్మన్ విట్టల్ - nizamabad zp plantes saplings latest News

నిజామాబాద్ జడ్పీ ఆవరణలో జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు గ్రీన్ ఫ్రైడే కార్యాక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా ప్రతి శుక్రవారం మొక్కలను నాటి వాటి సంరక్షణ చేపట్టాలని విట్టల్ రావు సూచించారు.

గ్రీన్ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్
గ్రీన్ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్

By

Published : Sep 19, 2020, 1:03 PM IST

నిజామాబాద్ జడ్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మొక్కలు నాటారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ వంతుగా ప్రతి శుక్రవారం మొక్కలను నాటి వాటి సంరక్షణ చేపట్టాలన్నారు.

33శాతం కోసం..

రాష్ట్రంలో 33 శాతానికి అడవులను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఛైర్మన్ సూచించారు. జడ్పీ సీఈఓ గోవింద్, పర్యవేక్షకులు శివకుమార్, రఘు, సునీతాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి : డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్​ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details