మైనింగ్ పేరిట వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నడుస్తోందని భాజపాఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మైనింగ్ పై సీబీఐవిచారణకు ఆదేశించాలనిడిమాండ్ చేశారు. తెరాస నాయకులు సిండికేట్‌గా మారి జీరో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రానైట్ వ్యాపారంతో కేవలం వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు మాత్రమే లబ్దిపొందుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
మైనింగ్ పేరిట అక్రమ వ్యాపారం నడుస్తోంది: బండి సంజయ్ - కరీంనగర్ ఎంపీ
రాష్ట్రంలో మైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయల జీరో దందా నడుస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మైనింగ్ పేరు మీద జీరో దందా నడుస్తోంది