zero covid cases in Telangana : రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరోనా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2020 మార్చిలో మొట్ట మొదటిసారి రాష్ట్రంలో కోవిడ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత మూడు వేవ్‌లుగా కోవిడ్ ప్రజలను వణికించింది.వేల మందిని బలితీసుకుంది. ఇక 2022లో కోవిడ్ పెద్దగా ప్రభావం చూపకపోయినా చైనాలో పెరిగిన కేసులు ఆందోళన కలిగించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీరో కేసులు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేసింది. తాజాగా 3,690 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్టంలో కేవలం 19 మందికి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పాటించాలన ప్రభుత్వం తెలిపింది.