యువ కళావాహిని వ్యవస్థాపకులు వైకే నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. మూడు రోజుల నుంచి.. దగ్గు, తీవ్ర జలుబుతో బాధ పడుతోన్న ఆయనను.. హఠాత్తుగా పల్స్ పడిపోవడంతో కూకట్పల్లి, వివేకానందా నగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సహకార శాఖ ఉద్యోగస్థుడైన నాగేశ్వరరావు.. పదవీ విరమణ అనంతరం తన జీవితాన్ని పూర్తిగా సాంస్కృతిక రంగానికి అంకితం చేశారు. ఉద్యోగం చేస్తూనే.. నాలుగున్నర దశాబ్దాల క్రితం యువ కళావాహినిని స్థాపించారు. స్వామి వివేకానంద నాటకంలో ప్రధాన పాత్రను పోషించి.. అమెరికాతో పాటు దేశంలోని అనేక నగరాల్లో 150 ప్రదర్శనలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు.