హనుమాన్ జయంతి పురస్కరించుకుని... హైదరాబాద్‌లో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో... గో మహా ఆరోగ్య హోమం నిర్వహించారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని త్రి శక్తి హనుమన్ దేవస్థానంలో ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ హోమంలో పాల్గొన్నారు.
'ప్రతి ఒక్కరూ గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి'
హనుమాన్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్‌లో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో మహా ఆరోగ్య హోమం చేపట్టారు. కరోనా నివారణ, ఆక్సిజన్ పెరుగుదల కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 70 దేవాలయాల్లో ఏకకాలంలో ఈ హోమం నిర్వహించినట్లు వెల్లడించారు. గో సంరక్షణ కోసం ఒక్కొక్కరు కనీసం ఐదు దేవాలయాల్లో హోమం జరిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
'ప్రతి ఒక్కరూ గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి'
కరోనా నివారణకు జీహెచ్ఎంసీ పరిధిలోని 70 దేవాలయాల్లో ఏక కాలంలో హోమం చేసినట్లు తెలిపారు. ఒక్కో దేవాలయానికి కిలో ఆవు నెయ్యి, 10 గోమయ పిడకలు ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. గో సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షో