yuga thulasi chairman arrest: గో హత్యలు ఆపాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గో ఆగ్రహ నిరాహార దీక్ష పేరుతో... యుగ తులసి ఫౌండేషన్ చేపట్టిన ఛలో బహదూర్‌పురా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్‌ను లక్డీ కా పూల్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
yuga thulasi chairman arrest : యుగ తులసి ఛైర్మన్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష - హైదరాబాద్ జిల్లా వార్తలు
yuga thulasi chairman arrest: గో ఆగ్రహ నిరాహారదీక్ష పేరుతో యుగ తులసి ఫౌండేషన్ చేపట్టిన ఛలో బహదూర్‌పురా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. యుగతులసీ ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని.. రాంగోపాల్‌పేట్ పీఎస్‌కు తరలించారు. గో వధను అరికట్టి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని శివకుమార్ డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోనే దీక్షకు దిగారు.
yuga thulasi chairman arrest
అక్రమ అరెస్టులను నిరసిస్తూ... శివకుమార్ పోలీస్‌స్టేషన్‌లోనే దీక్షకు దిగారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహదూర్‌పురా వెళ్లి తీరుతామని తెలిపారు. గో వధశాలల్ని పూర్తిగా బంద్ చేయాలని డిమాండ్ చేశారు. గో కబేళాలు మూసివేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని శివ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:IAMC: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ