YS Sharmila meets Governor Tomorrow: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రేపు భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని మధ్యాహ్నం 12 గంటలకు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలన, వైఫల్యాలపై వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ నుంచే వై.ఎస్.షర్మిల నేరుగా పాదయాత్రకు బయలుదేరుతారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వై.ఎస్.షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని వైఎస్సార్టీపీ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. గతంలో ఆపేసిన ప్రాంతమైన వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి వై.ఎస్.షర్మిల పాదయాత్ర మొదలుపెడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
YS Sharmila Praja Prasthana Padayatra: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసిన నేపథ్యంలో రేపటి నుంచి 18 వరకు యాత్ర కొనసాగనుంది. వ్యక్తిగత దూషణలు చేయరాదని, ఇతర పార్టీలు, కులాలు, మతాలను కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంటూ 14 షరతలతో అనుమతిచ్చారు. గురువారం నుంచి 18 వరకు నిర్వహించుకోవడానికి అనుమతించారు. వరంగల్ జిల్లా శంకరమ్మ తండా నుంచి.. నెక్కొండ, పర్వతగరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఘన్పూర్, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం వరకూ యాత్ర చేసేందుకు వరంగల్ సీపీ అనుమతించారు.