తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Questioning KCR Corruption : 'బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదు.. కేసీఆర్​ అవినీతి ఎంతో తెలుసా?​' - కేసీఆర్​పై మండిపడ్డ షర్మిల

YS Sharmila Fires On KCR : కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్​ రాష్ట్రంగా మార్చారని వైఎస్​ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్​ సర్కార్​కు పది ప్రశ్నలను సందిస్తున్నానన్నారు. అందుకు సంబంధించిన పోస్టర్​ను ఆమె విడుదల చేశారు. హైదరాబాద్​లోని గన్​పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన షర్మిల.. అనంతరం కేసీఆర్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Jun 1, 2023, 4:58 PM IST

Sharmila Released Postal Asking 10 Questions To KCR : బీఆర్​ఎస్​ పార్టీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని.. అభ్యర్థులను తయారు చేసుకునే పోటీ చేస్తామని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను కేసీఆర్​ ఎప్పుడో బీఆర్​ఎస్​గా పేరు మార్చి.. తుంగలో తొక్కేశారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని గన్​పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన షర్మిల.. అనంతరం కేసీఆర్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో తెలంగాణను బంగారు తెలంగాణ కాకుండా లిక్కర్​ రాష్ట్రంగా మార్చారని వైఎస్​ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్​ సర్కార్​కు పది ప్రశ్నలను సంధిస్తున్నానన్నారు. అందుకు సంబంధించిన పోస్టర్​ను ఆమె విడుదల చేశారు. కాళేశ్వరంలో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి సొమ్ము మొత్తం కేసీఆర్​ వద్దనే ఉందని.. ఆ సొమ్ముతోనే దేశం మొత్తం మీద ఎంపీలను గెలిపించుకుంటాననే చెప్పి బీఆర్​ఎస్​ పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"ప్రతి తెలంగాణ బిడ్డ మీద, ఆఖరికి పుట్టబోయే శిశువు మీద కూడా రూ.1.50 లక్షలు అప్పును కేసీఆర్​ మోపడం జరిగింది. అన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చి కూడా ఈ రోజు రుణమాఫీ అనేది ఎందుకు చేయడం లేదు. డబుల్​ బెడ్​ రూం ఇళ్ల కట్టడానికి, కనీసం పెన్షన్​లు ఇవ్వడం లేదు, జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు, సర్పంచ్​లకు కూడా వేతనం ఇవ్వడం లేదు ఇన్ని డబ్బులు ఏమైపోయాయి. ఈ విషయంపై తెలంగాణ సమాజానికి కేసీఆర్​ సమాధానం చెప్పాలి. దేశంలోని పార్లమెంటు ఎన్నికలకు కూడా ఫైనాన్స్​ చేసే డబ్బు కేసీఆర్​ వద్ద ఉంది. అందుకే బీఆర్​ఎస్​ పార్టీగా పేరు మార్చి.. ఎంపీలను కొనాలి అనుకుంటున్నారు." - వైఎస్​ షర్మిల, వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు

YS Sharmila Comments On KCR : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. రాజకీయ పార్టీల పేరులో తెలంగాణ అనే పేరు ఉండోద్దా చెప్పాలని ప్రశ్నించారు. తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తానని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎంతో కష్టపడి.. ఒక ఆశయంతో పార్టీని స్థాపించానని.. ఒక మహిళ కష్టాన్ని ఇలాంటి మాటలతో నీరుగార్చవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, బీజేపీలు ఎన్నికల్లో తమ పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్​ చేశారు. తాను ఈ క్షణమే పార్టీలో చేరతానంటే ఏ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు చెప్పండి అని ప్రశ్నించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీకి మెజార్టీ కూడా దక్కదని జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదని.. కాంగ్రెస్​ పార్టీ చెప్పగలదా అని షర్మిల ప్రశ్నలు వేశారు.

బీఆర్​ఎస్​ పార్టీతో ఎప్పటికీ పొత్తు ఉండదు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details