తెలంగాణ

telangana

ETV Bharat / state

Ys Sharmila: 'ప్రభుత్వం చేయలేని న్యాయాన్ని దేవుడు చేశాడు' - saidabad incident news

సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రభుత్వం చేయలేని పని దేవుడు చేశాడని అన్నారు.

Ysrtp chief Ys sharmila
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ

By

Published : Sep 16, 2021, 10:29 PM IST

సైదాబాద్ హత్యాచార ఘటన (Saidabad Incident)లో అసమర్ధ ప్రభుత్వం చేయని న్యాయాన్ని దేవుడు చేశాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ysrtp Chief Ys Sharmila) అన్నారు. ఈ అంశంలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్​ లోటస్​పాండ్​లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ నిరసన దీక్షల వల్లే ప్రభుత్వం, పోలీసుల్లో కదలిక వచ్చిందని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబానికి మద్దతుగా శాంతియుతంగా చేస్తోన్న తమ దీక్షను పోలీసుల భగ్నం చేసిన తీరును ఆమె ఖండించారు.

నిరసన తెలిపే హక్కు తెలంగాణలో లేదా? ప్రభుత్వ వ్యవహారశైలి తాలిబన్ల తీరును తలపిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు ఉన్న చిత్తశుద్ధి.. యువతకు ఉద్యోగ కల్పనలో, రాష్ట్రంలో మత్తుపదార్ధాల నిర్మాలనలో ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని షర్మిల అభిప్రాయపడ్డారు.

మేం దీక్ష చేపట్టిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. పోలీసులలో కదలిక వచ్చింది. ప్రభుత్వం చేయలేని న్యాయం... దేవుడు చేశాడు. శాంతియుతంగా చేస్తోన్న తమ దీక్షను పోలీసుల భగ్నం చేశారు. దీనిపై ఏ ఒక్కరూ స్పందించలేదు.

-- వైఎస్ షర్మిల, వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు

'ప్రభుత్వం చేయలేని న్యాయాన్ని దేవుడు చేశాడు'

ఇదీ చూడండి: YS Sharmila: వైఎస్‌ షర్మిల దీక్ష భగ్నం.. లోటస్‌పాండ్‌లో గృహనిర్బంధం!

ABOUT THE AUTHOR

...view details