తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా భర్తకు ఏమైనా జరిగితే.. ఆ ఎమ్మెల్యేదే బాధ్యత' - రాచమల్లు న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్​రెడ్డే బాధ్యులని.. వైకాపాకు చెందిన పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు తన భర్త భాస్కర్​ను అడ్డగించి బెదిరించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

mla
mla

By

Published : Jul 6, 2022, 5:29 PM IST

తన భర్తకు ఏమైనా జరిగితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి బాధ్యులని వైకాపాకు చెందిన పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు తన భర్త భాస్కర్​ను అడ్డగించి బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ.. పార్టీ కోసం కృషి చేస్తున్న తన భర్తపై బెదిరింపులకు దిగటం సరికాదన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే రాచమల్లు డబ్బులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు ఆయన వర్గీయుల ద్వారా వేధిస్తున్నారన్నారు.

'నా భర్తకు ఏమైనా జరిగితే.. ఆ ఎమ్మెల్యేదే బాధ్యత'

ABOUT THE AUTHOR

...view details