సవాల్, ప్రతిసవాళ్లతో ఏపీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాజకీయాన్ని వేడిక్కించిన వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేశారు. కొద్దిరోజుల క్రితం సూర్యనారాయణరెడ్డిపై నల్లమిల్లి అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి... బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసరగా రామకృష్ణారెడ్డి దీన్ని స్వీకరించారు.
ఇళ్ల వద్ద బందోబస్తు
ఈ క్రమంలో ఇరువురి ప్రమాణానికి పోలీసులు అనుమతించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సూర్యనారాయణరెడ్డి, సాయంత్రం నాలుగున్నర గంటలకు రామకృష్ణారెడ్డి... ప్రమాణం చేసేందుకు అంగీకరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా నేతల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షక భటుల తీరుకు నిరసనగా ఇంట్లోనే ఆందోళన చేశారు.
నలుగురికి మాత్రమే అనుమతి
మధ్యాహ్నం నేతలిద్దరూ ప్రమాణం చేసేందుకు ఆలయానికి చేరుకోగా... ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేని గుడికి తీసుకొచ్చిన పోలీసులు... ఆయనతో పాటు నలుగురిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. తర్వాత నల్లమిల్లితో పాటు మరో నలుగురిని గుడిలోకి పంపారు. దేవుని ఎదుట ప్రమాణం చేసే సమయంలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
సత్య ప్రమాణం చేయలేదు