MLA DHARMANA KRISHNA DAS: ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో శనివారం జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయమని జోస్యం చెప్పారు.
'వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకపోతే.. నేను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తా' - నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
MLA DHARMANA KRISHNA DAS: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
!['వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకపోతే.. నేను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తా' MLA DHARMANA KRISHNA DAS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16726573-95-16726573-1666507847490.jpg)
MLA DHARMANA KRISHNA DAS
సమర్థ నాయకుడైన జగన్ రాష్ట్రంలో అన్ని స్థానాలకు పొత్తులేకుండా పోటీ చేస్తారని తెలిపారు. దమ్ముంటే పొత్తు లేకుండా రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేయాలని తెదేపా, జనసేన పార్టీలకు సవాల్ విసిరారు. 25 గ్రామాల ప్రజల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తుంటే.. పవన్‌కల్యాణ్ తెదేపాకు వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయమంటే సినిమా కాదని పరిణతి కావాలని హితవు పలికారు. చంద్రబాబునాయుడు పైనా విమర్శలు గుప్పించారు.
ఇవీ చదవండి: