తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ap news

2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

AP Govt On DA
AP Govt On DA

By

Published : Dec 20, 2021, 8:42 PM IST

2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరవు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్​లు, గ్రామపంచాయితీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో పేర్కోంది.

ఇదీ చూడండి:గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులే: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details