తెలియని మార్గాల నుంచి అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీల్లో వైకాపా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తెదేపా అయిదో స్థానంలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.
తెలియని మార్గాల్లో వచ్చిన విరాళాల్లో వైకాపాకు రెండో స్థానం - ycp second place in unknown sources list news
దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.885.956 కోట్లు విరాళాలు రాగా, అందులో 54.32% (రూ.481.276 కోట్లు) తెలియని మార్గాల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.885.956 కోట్లు విరాళాలు రాగా, అందులో 54.32% (రూ.481.276 కోట్లు) తెలియని మార్గాల నుంచి వచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి మార్గాల నుంచి అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల జాబితాలో ఒడిశాకు చెందిన బీజేడీ (రూ.213.543 కోట్లు) ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైకాపా (రూ.100.504 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో శివసేన (రూ.60.73 కోట్లు), జేడీఎస్ (రూ.39.13 కోట్లు), తెలుగుదేశం (రూ.37.78 కోట్లు) ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 90.798% (రూ.436.99 కోట్లు) విరాళాలు సమకూరాయి.
ఇదీ చదవండి:బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎల్జీ పాలిమర్స్ ఎండీ
TAGGED:
ఏడీఆర్ నివేదిక వార్తలు