వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి (YS Rajasekhar Reddy Jayanti ) సందర్భంగా జులై 8న ఆయన తనయ వైఎస్ షర్మిల.. కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ కో- ఆర్డీనేటర్ రాజగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు.
YSRTP రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. ఆ రోజే ప్రారంభం! - YS Rajasekhar Reddy death anniversary
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్ జయంతి (YSR Birth anniversary) సందర్భంగా జులై 8న(July8) పార్టీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
![YSRTP రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. ఆ రోజే ప్రారంభం! YSRTP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12044683-thumbnail-3x2-kee.jpg)
YSRTP
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు రాజగోపాల్ తెలిపారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు.
Last Updated : Jun 7, 2021, 12:52 PM IST