IPPATAM YSR STATUE: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉన్న రెండు వైఎస్సార్ విగ్రహాల్లో ఒకటి తొలగించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఒక విగ్రహాన్ని క్రేన్ సాయంతో తరలించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న మరో విగ్రహాన్ని తొలగించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రహదారి విస్తరణ పేరుతో గ్రామంలోని ఇళ్లను అధికారులు కూలగొట్టారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం విగ్రహాలు కూడా తొలగించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ వైఎస్సార్ విగ్రహం తొలగింపు.. కానీ..!
IPPATAM YSR STATUE: ఏపీలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటన కలకలం రేపింది. అయితే రహదారి విస్తరణ పనులలో భాగంగా ఇళ్లను, రోడ్డు ప్రక్కన ఉన్న నేతల విగ్రహాలను తొలగించారు. కానీ, వైఎస్ విగ్రహాన్ని తొలగించకుండా అలానే ఉంచారు. విగ్రహం తొలగించకపోవటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
IPPATAM YSR STATUE
రెండు రోజుల క్రితం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. రోడ్డు మీద ఉన్న వైఎస్ విగ్రహాలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కంచెలు ఏర్పాటు చేసి మరీ పోలీసులను కాపలా పెట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు. దీనిపై స్పందించిన అధికారులు.. ఒక విగ్రహాన్ని మాత్రం తీసేశారు.
ఇవీ చదవండి: