తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి చర్చలోకి వైఎస్సార్​ పేరు.. ఈసారి ఏకంగా కోడిగుడ్లపైనే..

YSR STAMP ON EGGS : ఏపీలో బాలింతలు, అంగన్​వాడీలోని చిన్నారులు, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. అయితే సహజంగా ఈ కోడిగుడ్లు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం స్టాంపులు వేస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోడిగుడ్లపై వైఎస్సార్​ స్టాంప్​ వేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

By

Published : Dec 23, 2022, 5:52 PM IST

Bapatla district
Bapatla district

YSR STAMP ON EGGS: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే కోడిగుడ్డుపై వివిధ రకాల స్టాంపులు వేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లపై వైఎస్సార్​ ఎస్పీ అని స్టాంప్ వేశారు. మామూలుగా బాలింతలు, చిన్నారులు, విద్యార్థులకు పంపిణీ చేసే గుడ్లకు.. మార్కెట్​లో దొరికే వాటికి తేడా తెలిసేందుకు ఈ విధంగా స్టాంప్ వేస్తారు.

కానీ ప్రభుత్వం మాత్రం మరి కొంచెం ఆలోచించి.. వైఎస్సార్​ ఎస్పీ పేరుతో ఉన్న గుడ్లను విద్యార్థులకు అందించారు. వైఎస్సార్ తాత పేరు కూడా గుర్తించుకోవాలని జగన్ మామ ఈ కోడిగుడ్లు ఇచ్చారేమో అని పిల్లలు అనుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details