తెలంగాణ

telangana

ETV Bharat / state

చిక్కీలలో పురుగుల కలకలం.. వీడియో వైరల్ - Insects are added to the traps

Worms in YSR kits: ఏపీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో.. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన వైఎస్సార్ కిట్లలో.. పురుగులు ప్రత్యక్షమైన సంఘటన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. స్పందించిన అధికారులు విచారణ ప్రారంభించారు.

Worms in YSR kits
Worms in YSR kits

By

Published : Nov 20, 2022, 5:20 PM IST

Worms in YSR kits: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన వైఎస్సార్ కిట్లలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. వేరుసెనగ చిక్కీలలో పురుగులు వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. నగరంలోని పాతూరులో ఉన్న రాణినగర్ కేంద్రం నుంచి పంపిణీ చేసిన కిట్లలో ఈ పురుగులు కనిపించాయి.

సమాచారం అందుకున్న అధికారులు.. ఈ కిట్లు పాతవా ? కొత్తవా ? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. మరో వైపు రాణినగర్ ప్రాంతంలో.. వైఎస్సార్ కిట్లను రెండు రోజుల క్రితం.. పంపిణీ చేసినట్లు వీడియోలో నజీర్ అనే వ్యక్తి తెలిపారు.

చిక్కీలలో పురుగుల కలకలం.. వీడియో వైరల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details