శత్రువులైనా.. వైఎస్‌ఆర్‌ను అభిమానించారని వైఎస్ విజయమ్మ అన్నారు. నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలని పేర్కొన్నారు. నాయకుడంటే తన వాళ్ల కష్టాలు.. నష్టాలను భరించేవాడని, ప్రజల బతుకు కోరేవాడే నిజమైన నాయకుడని చెప్పారు. అలాంటి నాయకుడు వైఎస్‌ఆర్ ఒక్కరే అని అన్నారు. వైఎస్‌ఆర్ జనం కోసం జీవించారని తెలిపారు. ఆయన ఆత్మీయత హావభావాలు జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని చెప్పారు.
వైఎస్‌ఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయని విజయమ్మ చెప్పారు. తండ్రి కలలు సాకారం చేసేందుకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తున్నారని, మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందన్నారు. షర్మిలను మీ కుటుంబసభ్యురాలిగా అక్కున చేర్చుకోవాలని కోరారు.