తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila news: షర్మిల నేటి నిరుద్యోగ నిరాహార దీక్ష వాయిదా

YS Sharmila news,YS Sharmila nirudyoga nirahara deeksha postponed
షర్మిల నేటి నిరుద్యోగ నిరాహార దీక్ష వాయిదా, వైఎ్స షర్మిల వార్తలు

By

Published : Nov 16, 2021, 10:32 AM IST

09:29 November 16

షర్మిల నేటి నిరుద్యోగ నిరాహార దీక్ష వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం వైస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila news) నిరుద్యోగుల కోసం చేపట్టే నిరాహారదీక్ష(sharmila nirudyoga nirahara deeksha) వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి(mlc election code in telangana) కారణంగా షర్మిల దీక్ష(YS Sharmila deeksha) వాయిదా పడింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సంకల్ప సభలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడనున్నట్లు షర్మిల ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పలువురు బలవన్మరణం చేసుకున్నారని... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో లక్షా 90 వేలకు పైగా ఉన్న ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసి... నిరుద్యోగులకు న్యాయం చేయాలని షర్మిల డిమాండ్​ చేశారు.  అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఆమె దీక్ష చేస్తున్నారు. 

నిరుద్యోగుల కోసం..

రాష్ట్రంలో కేవలం ఏడేళ్లలోనే దాదాపు నాలుగు రెట్లు నిరుద్యోగులు పెరిగారని షర్మిల గతంలో ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​కు పరిమితమైనందునే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్​లో చలనం రావడం లేదని ఆక్షేపించారు. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటిగా ఉందని ఆమె గుర్తు చేశారు. ఏడేళ్ల నుంచి ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు లేక వయో పరిమితి కోల్పోయిన వేలాది మంది నిరుద్యోగులకు వయో పరిమితి పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగాలు రాక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల మండిపడ్డారు.

పాదయాత్రకూ బ్రేక్

రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, యువత ధైర్యం కోల్పోవద్దని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని అన్నారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పోయి.. వైఎస్​ఆర్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇవాళ్టి దీక్ష వాయిదా పడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రస్థాన యాత్రకు కూడా స్వల్ప విరామం ప్రకటించారు. ఎన్నికల కోడ్(mlc elections in telangana) ముగిసిన వెంటనే మళ్లీ పాదయాత్ర(ys sharmila padayatra 2021) ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు 21 రోజుల పాటు... 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో పాదయాత్ర పూర్తిచేసినట్లు ఆమె వెల్లడించారు.  

ఇదీ చదవండి: YS Sharmila latest news: షర్మిల యాత్రకు చిన్న బ్రేక్.. ఎల్లుండి నుంచి నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details