తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల అనుచరుల ఆందోళన - Ys sharmila followers protest at tankbund

హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో వైఎస్ షర్మిల అనుచరులు ధర్నా చేపట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కొవిడ్ రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Sharmila
Sharmila

By

Published : Apr 28, 2021, 1:23 PM IST

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని... జర్నలిస్టులను కరోనా వారియర్స్​గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల అనుచరులు ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కొవిడ్ రెండో దశ వేగంగా విస్తరిస్తోందని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక... ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్టులను కరోనా వారియర్స్​గా గుర్తించాలని… కొవిడ్ టెస్ట్​ల సంఖ్య పెంచాలని, అంబులెన్స్​లను అందుబాటులో ఉంచాలని కోరుతూ ధర్నా చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details