రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వై.ఎస్.షర్మిల సీఎం కేసీఆర్ను ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగాలు కాదు... పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని షర్మిల కేసీఆర్ను కోరారు.
తాజాగా ఆరోగ్య శాఖలో 755 కంట్రాక్టు ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందించారు. 'కొసరకండి కేసీఆర్ దొర... వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 23,512 ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తే కరోనా చావులతోపాటు... నిరుద్యోగుల చావులను కొంతైనా ఆపొచ్చు' అని సీఎంకు విజ్ఞప్తి చేశారు.