తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Tweet on KTR : 'ఎలక్షన్​కు ఆర్నెళ్ల ముందు నిద్రలేచే కుంభకర్ణుడు.. కేసీఆర్' - వైఎస్ షర్మిల ట్విటర్

YS Sharmila Comments on KTR : రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగిందని దుయ్యబట్టారు. నిరుద్యోగ జాబితాలో.. ఆత్మహత్యల్లో నంబర్ వన్‌గా రాష్ట్రం ఉన్నందుకు బీఆర్‌ఎస్‌ను మళ్లీ ఎన్నుకోవాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులు అయితే.. ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచే కుంభకర్ణుడు కేసీఆర్ అని షర్మిల ఎద్దేవా చేశారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Jun 9, 2023, 1:37 PM IST

Sharmila Fires on KCR and KTR : 'తెలివిలేనివారు కాంగ్రెస్‌ వారయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర' అని.. మంత్రి కేటీఆర్‌నుఉద్దేశిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు చేతకాని వాళ్లనప్పుడు 2014లో వారిని కొన్న మీరు ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో 2018లో మరో 12మంది ఎమ్మెల్యేలను.. అధికారపార్టీ కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులు అయితే.. ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచే కుంభకర్ణుడు.. కేసీఆర్ అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.

Sharmila Comments on KTR : రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ఎందుకు ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పాలని కేటీఆర్‌ను.. వైఎస్ షర్మిలప్రశ్నించారు. రూ.16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని.. రూ.5 లక్షల కోట్లు అప్పులకుప్పగా ముఖ్యమంత్రి మార్చారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరు చెప్పి కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు కాజేసిందని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి తొమ్మిది సంవత్సరాల్లో.. 65,000 ఉద్యోగాలే ఇచ్చినందుకు మళ్లీ అధికారం ఇవ్వాలా అని వైఎస్‌ షర్మిల నిలదీశారు.

కేసీఆర్ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. నిరుద్యోగ జాబితాలో.. ఆత్మహత్యల్లో నంబర్ వన్‌గా రాష్ట్రం ఉన్నందుకు బీఆర్‌ఎస్‌ను మళ్లీ ఎన్నుకోవాలా అని ప్రశ్నించారు. రెండు దఫాలుగా లక్ష ఇండ్లు కట్టలేని మీరు.. తిరిగి పేదలను ఉద్ధరిస్తామని చెప్తే నమ్మాలా? అని అన్నారు. ధరణి పేరు చెప్పి భూములు లాక్కున్నారని ఆక్షేపించారు. వడ్లు కొనడం లేదని కేంద్రం మీద నెపం నెట్టి.. రైతుల చావులకు కేసీఆర్ కారణమయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు.

"కేసీఆర్ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగింది. నిరుద్యోగ జాబితాల్లో.. ఆత్మహత్యల్లో నంబర్ వన్‌గా ఉన్నందుకు బీఆర్‌ఎస్‌ను మళ్లీ ఎన్నుకోవాలా?. రెండు దఫాలుగా లక్ష ఇండ్లు కట్టలేని మీరు.. తిరిగి పేదలను ఉద్ధరిస్తామని చెప్తే నమ్మాలా?. ధరణి పేరు చెప్పి భూములు లాక్కున్నారు. వడ్లు కొనడం లేదని కేంద్రం మీద నెపం నెట్టి.. రైతుల చావులకు కేసీఆర్ కారణమయ్యారు. పోడు పట్టాల నుంచి మొదలు దళితబంధు వరకు ముఖ్యమంత్రి మోసాలకు తెరలేపారు"- వైఎస్‌ షర్మిల, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

Sharmila Fires on KCR :వరి వేస్తే ఉరేనని.. కౌలు రైతు రైతే కాదని ముఖ్యమంత్రి అన్నారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. 9,000 మంది అన్నదాతల మరణానికి కారణం కేసీఆర్‌ అని విమర్శించారు. పోడు పట్టాల నుంచి దళితబంధు వరకు ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. చేతకాని వారంతా బందిపోట్ల రాష్ట్ర సమితిలోనే ఉన్నారనేది జగమెరిగిన సత్యమని అన్నారు. మీలాంటి వారిని ఆశీర్వదించడం కాకుండా.. మిమ్మల్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details