తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Respond on Group-1 Prelims Exam Cancelled : 'ఊరించి ఊరించి 9 ఏళ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కాస్త.. గట్టు దాటక పాయె'

YS Sharmila Respond on Group-1 Prelims Exam Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై.. వైఎస్ షర్మిల స్పందించారు.503 పోస్టులకు రెండుసార్లు పరీక్షలు జరిగి రద్దయిన ఘటన ఇదేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బహుశా దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ అసమర్థ విధానాలకు ఇది ఒక నిదర్శమని మండిపడ్డారు.

YS Sharmila Fires on KCR
YS Sharmila Respond on Group-1 Prelims Exam Cancelled

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 10:52 PM IST

YS Sharmila Respond on Group-1 Prelims Exam Cancelled in Telangana :గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. ఉద్యమంలో గ్రూప్-1 పరీక్షలు రాయకండి.. మన పరీక్షలు మనమే రాసుకుందామని రెచ్చగొట్టిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఊరించి ఊరించి 9 ఏళ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ (Notification) గట్టు దాటక పాయె అని సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

503 పోస్టులకు రెండుసార్లు పరీక్షలు జరిగి రద్దయిన ఘటన ఇదేనని వైఎస్ షర్మిల అన్నారు బహుశా దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అసమర్థ విధానాలకు ఒక నిదర్శమని మండిపడ్డారు. పాలన చేతకాదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమేనని ఆరోపించారు. సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమేనని దుయ్యబట్టారు. ఇది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని వైఎస్​ షర్మిల పేర్కొన్నారు.

Group 1 Prelims Exam Cancelled Telangana : 'గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో TSPSC అజాగ్రత్తగా ఉంది.. ప్రిలిమ్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించండి'

YS Sharmila Fires on KCR : టీఎస్​పీఎస్సీకి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని చెప్పినా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. నెత్తి నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు పెట్టారన్నారు. ఆనాడే లీకుల సూత్రదారులను పక్కన పెట్టి ఉంటే.. నిరుద్యోగుల డిమాండ్లను గౌరవించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే.. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఫలితంగా 2.37 లక్షల మంది గ్రూప్-1 అభ్యర్థులకు నష్టం జరిగేది కాదని తెలిపారు. టీఎస్​పీఎస్సీ(TSPSC) వైఫల్యానికి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని.. అదేవిధంగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల ట్విటర్​ వేదికగా డిమాండ్ చేశారు.

TSPSC Appeal Petition Against Group 1 Prelims Cancellation : అప్పీల్​ పిటిషన్​ వేసేందుకు సిద్ధమవుతోన్న TSPSC.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు

గ్రూప్​-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై బీజేపీ నేతలు శనివారం స్పందించారు. రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష(Group-1 Preliminary Exam)ను రద్దు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే ఇందుకు కారణమని దుయ్యబట్టారు. గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది నిరుద్యోగ యువతలో నైరాశ్యం నింపేలా.. కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపట్ల చిత్తశుద్ధి లేదని డీకే అరుణ మండిపడ్డార. మద్యం నోటిఫికేషన్​పై ఉన్న శ్రద్ద.. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని విమర్శించారు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చవుతుందని.. రాష్ట్ర సర్కార్ కక్కుర్తిపడడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

BJP Leaders Respond on Group 1 Prelims Exam Cancelled : 'రాష్ట్ర సర్కార్​ వైఫల్యం.. యువతకు శాపంగా మారింది'

Telangana Group1 Prelims Final Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

ABOUT THE AUTHOR

...view details