తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాళీలు భర్తీ చేసేదాక కేసీఆర్‌ను వదలబోం: వైఎస్ షర్మిల - ys sharmila deeksha at indira park

హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో షర్మిల దీక్షకు పూనుకున్నారు. సాయంత్రం 5 వరకు ఈ దీక్ష కొనసాగనున్నది.

నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాడతాం: షర్మిల
ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల ఒక్కరోజు దీక్ష

By

Published : Apr 15, 2021, 12:14 PM IST

Updated : Apr 15, 2021, 12:24 PM IST

నిరుద్యోగ సమస్యలపై వైఎస్​ షర్మిల ఇందిరా పార్కు ధర్నాచౌక్​లో... ఉద్యోగదీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష... సాయంత్రం ఐదు గంటల వరకు... కొనసాగనుంది.

తెలంగాణ కోసం యువత త్యాగాలు చేశారని షర్మిల పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులు... ప్రభుత్వ నోటిఫికేషన్‌ల కోసం వేచి చూసి వేసారి.... బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాడతామని ప్రకటించారు. యువత చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. ఖాళీలు భర్తీ చేసేదాక కేసీఆర్‌ను వదలబోమని తెలిపారు. నిరుద్యోగులకు సంఘీభావంగా 3 రోజులు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో తమ కార్యకర్తలు దీక్షలు చేపడతారని వివరించారు.

నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాడతాం: షర్మిల
Last Updated : Apr 15, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details