తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్ షర్మిల పార్టీ.. మండల స్థాయి కమిటీల నియామకం! - తెలంగాణ వార్తలు

వైఎస్ షర్మిల తన పార్టీ ప్రారంభానికి ముందుగానే మండల స్థాయి కమిటీలు నియమించాలని నిర్ణయించారు. ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో లోటస్ పాండ్​లో సమావేశం అయిన షర్మిల... తన పార్టీ బలోపేతంపై చర్చించారు.

Ys sharmila Meeting And decided to form Mandal Committees
వైఎస్ షర్మిల పార్టీ.. మండల స్థాయి కమిటీల నియామకం!

By

Published : Mar 11, 2021, 9:44 PM IST

తన పార్టీ బలోపేతంపై ముఖ్య అనుచరులతో వైఎస్ షర్మిల లోటస్ పాండ్​లో సమావేశం అయ్యారు. పార్టీ ప్రారంభానికి ముందుగానే మండల స్థాయి కమిటీలు నియమించాలని నిర్ణయించారు. ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 16లోపు కమిటీల ఏర్పాటు కోసం ముఖ్య అనుచరుడు పిట్టా రామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

వైఎస్ షర్మిలకు ముందు నుంచి అండగా ఉన్న వైఎస్సార్ అభిమానులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న ఇవాళ వైఎస్ షర్మిళను కలిశారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను షర్మిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: రేపు భాజపా 'తెలంగాణ ఉద్యమ గళాల గర్జన'

ABOUT THE AUTHOR

...view details