అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సులందరికీ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీ ప్రాణాలను పణంగా పెట్టి.. మీ బంధాలను దూరం పెట్టి.. మీ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న నర్సులందరికీ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.
నర్సులందరికీ సెల్యూట్ : వైఎస్ షర్మిల - నర్సులందరికీ సెల్యూట్ చేసిన వై.ఎస్. షర్మిల
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పోరాటంలో వారు చూపే ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాన్నారు.

నర్సులకు శుభాకాంక్షలు తెలిపిన వై.ఎస్. షర్మిల
కరోనాను ఎదురుకోవడంలో విరామమే లేకుండా.. ముందుండి పోరాడుతున్న ప్రతి నర్సుకి నర్స్ డే శుభాకాంక్షలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో మీరు చూపే ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.