తెలంగాణ

telangana

ETV Bharat / state

YS SHARMILA DEEKSHA: నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం: వైఎస్ షర్మిల - సిరిసిల్ల జిల్లాలో వైఎస్​ షర్మిల

రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా సీఎం కేసీఆర్​కు పట్టడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆమె మండిపడ్డారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లెలో షర్మిల దీక్ష చేపట్టనున్నారు.

YS SHARMILA DEEKSHA
YS SHARMILA DEEKSHA

By

Published : Aug 3, 2021, 5:05 AM IST

Updated : Aug 3, 2021, 6:41 AM IST

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలంటూ.. ఆమె నేడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేపట్టే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లెలో.. వైఎస్ షర్మిల ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు తెలిపిన పార్టీ నేతలు.. ఉదయం లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి షర్మిల వెళ్తారని వివరించారు. నా చావుకు కారణం నిరుద్యోగం అంటూ ఓ యువకుడు జమ్మికుంట రైల్వే స్టేషన్​ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చూడండి:

రేపు సిరిసిల్ల నియోజకవర్గం గొల్లపల్లెలో వైఎస్​ షర్మిల నిరాహార దీక్ష

YS SHARMILA: 'నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది'

Last Updated : Aug 3, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details