తెలంగాణ

telangana

ETV Bharat / state

SHARMILA: 'కలిసి భోజనాలు చేసిన సీఎంలు.. నీటి సమస్యపై ఎందుకు చర్చించరు?' - telangana varthalu

ఏపీ తెలంగాణ జలవివాదంపై వైఎస్​ షర్మిల స్పందించారు. కలిసి భోజనాలు చేసిన ముఖ్యమంత్రులు.. కలిసి కూర్చుని నీటి పంచాయితీ పరిష్కరించుకోలేరా అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినీ వదులుకోబోమని మరోసారి స్పష్టం చేశారు.

SHARMILA: 'కలిసి భోజనాలు చేసిన సీఎంలు.. నీటి సమస్యపై ఎందుకు చర్చించరు?'
SHARMILA: 'కలిసి భోజనాలు చేసిన సీఎంలు.. నీటి సమస్యపై ఎందుకు చర్చించరు?'

By

Published : Jul 8, 2021, 8:31 PM IST

SHARMILA: 'కలిసి భోజనాలు చేసిన సీఎంలు.. నీటి సమస్యపై ఎందుకు చర్చించరు?'

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదంపై షర్మిల స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారన్న షర్మిల... మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా అని నిలదీశారు. ఏపీ రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్లు తెరిచారా? అని మండిపడ్డారు. హైదరాబాద్​ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె...కేసీఆర్‌ పాలనను తీవ్రంగా విమర్శించారు.

సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుందని ఆరోపించారు. సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన నీటిచుక్కను కూడా తీసుకోమని షర్మిల అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ సిద్ధాంతమని పేర్కొన్నారు.

రెండు నిమిషాలు కూర్చొని పరిష్కరించుకోలేరా?

'కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివొచ్చిందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా? మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు.

-వైఎస్​ షర్మిల

ఇదీ చదవండి: YSRTP: పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌టీపీ లక్ష్యం: షర్మిల

ABOUT THE AUTHOR

...view details