YS SHARMILA: మంత్రి కేటీఆర్‌కు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే మెరుగైన పథకాలు దేశంలో ఎక్కడైనా చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌పై షర్మిల మండిపడ్డారు. సరిగా అమలు కాని పథకాలను ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ వీటి కోసం రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
YS SHARMILA: 'మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్నదొరా?.. మీరు సల్లంగుండాలి.. '
YS SHARMILA: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని కేటీఆర్‌నుద్దేశించి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ కంటే మెరుగైన పథకాలు దేశంలో ఎక్కడైనా చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌పై షర్మిల మండిపడ్డారు.
YS SHARMILA: 'మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్నదొరా?.. మీరు సల్లంగుండాలి.. '
రైతు రుణమాఫీ, రైతుబీమా, ఉద్యోగ నోటిఫికేషన్‌లు, దళితులకు మూడెకరాల భూమి, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలను షర్మిల ప్రస్తావించి వీటిని అమలు చేయనందుకు రాజీనామా చేస్తారా అని నిలదీశారు. 'మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్నదోరా ? మీరు సల్లంగుండాలి.. రాష్ట్రం రావణకాష్టం కావాలని అంతే కదా మీ అద్భుత పాలన' అంటూ విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: