తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ: షర్మిల - ys sharmila comments on kcr

YS Sharmila Comments on KCR: మద్యం తాగించకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బానిసత్వపు తెలంగాణ అని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపిన షర్మిల.. ఆరు వారాల్లోగా దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని పేర్కొన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ys sharmila comments on cm kcr
కేసీఆర్​పై షర్మిల కామెంట్స్​

By

Published : Feb 22, 2022, 3:04 PM IST

YS Sharmila Comments on KCR: సీఎం కేసీఆర్​.. బంగారు భారత్​ ప్రకటనపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రలో ఎలా కలుపుతారని.. అది సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విలీనంపై కేటీఆర్​ మాట్లాడారని షర్మిల విమర్శించారు. హైదరాబాద్​ లోటస్​పాండ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ: షర్మిల

అందరికీ వర్తింపజేయాలి

59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింపచేయడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 66 లక్షల మంది అన్నదాతలు ఉంటే 41 లక్షల మందికే పథకం అమలవుతోందని ఆరోపించారు. 59 ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా? అని నిలదీసిన షర్మిల.. రైతుబీమాను రూ. 10 లక్షలకు పెంచాలని డిమాండ్​ చేశారు. వైతెపా కార్యాలయం వద్ద షర్మిల ఆధ్వర్యంలో సేవాలాల్​ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

"బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు, అది సాధ్యమా.? ప్రజలను రెచ్చగొట్టేందుకు కేటీఆర్‌ విలీనం గురించి మాట్లాడారు. బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తించట్లేదు. ఎల్ఐసీలో 70 ఏళ్లు పైబడిన వారికీ పాలసీలు ఉన్నాయి. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించాం. 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది." -వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఇదీ చదవండి:ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్​రాజ్​కు​ రాజ్యసభ సీటు?

ABOUT THE AUTHOR

...view details