తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రశ్నిస్తే అరెస్టులా: షర్మిల - ప్రజా ప్రస్థాన యాత్ర

YS Sharmila comments on CM KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్​ ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థాన యాత్రకు అనుమతి లేకపోవడంతో ట్యాంక్​బండ్​ వద్ద ఉన్న అంబేడ్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు షర్మిలను అరెస్ట్​ చేసి లోటస్​పాండ్​కు తరలించారు. ఇంటి వద్దనే ఆమె తన దీక్షను కొనసాగించారు.

YS Sharmila
వైఎస్​ షర్మిల

By

Published : Dec 9, 2022, 4:22 PM IST

Updated : Dec 9, 2022, 10:37 PM IST

ట్యాంక్​బండ్​ వద్ద వైఎస్​ షర్మిల నిరసన

YS Sharmila comments on CM KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థాన యాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో వైఎస్​ షర్మిల ట్యాంక్​ బండ్​ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. షర్మిల నిరసన తెలుపుతూ.. అంబేడ్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందించారు. తర్వాత ప్రజా ప్రస్థాన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వాలని షర్మిల కోరారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్​ ఖూనీ చేస్తున్నారని వైఎస్​ షర్మిల విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసి.. సంకేళ్లు వేస్తున్నారని వైఎస్​ షర్మిల ఆక్షేపించారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి.. ఇలా ప్రశ్నించిన వారిని అణగదొక్కడం భావ్యమేనా అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి ఎత్తి చూపడానికి చేస్తున్న యజ్ఞం లాంటిదని ఆమె అన్నారు. పాదయాత్రను శాంతియుతంగా చేస్తున్నాము.. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించలేదని.. అనుమతి ఇవ్వకపోవడం పట్ల తాత్సారం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వైఎస్సార్​టీపీ పార్టీ వల్ల కేసీఆర్ పాలనకు ప్రమాదం ఉందని తెలిసే.. పాదయాత్రను ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. 3500 కి.మీ. దాటిన తరవాత ఒక ఆడపిల్ల పాదయాత్ర చేస్తే టీఆర్​ఎస్​ వాళ్లు మాపై దాడి చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. బేడీలు వేస్తున్నారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు." -వైఎస్​ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మమ్మల్ని అరెస్ట్ చేసి.. పాదయాత్రను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్​ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తున్నారన్నారు. తాము పాదయాత్ర చేస్తే టీఆర్​ఎస్​కు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.

పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవుతానని స్పష్టం చేశారు. అరెస్ట్​ అనంతరం వైఎస్​ షర్మిలను లోటస్​పాండ్​కు తరలించారు. ట్యాంక్​బండ్​ వద్ద నిరసన విరమించాలని వైఎస్​ షర్మిలను పోలీసులు కోరారు. ఆమె నిరసన విడవకపోవడంతో సైఫాబాద్​ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్​ చేసి ఆమెను లోటస్​పాండ్​కు పంపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 9, 2022, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details