అక్రమాస్తుల కేసుల్లోని పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని అంశాలను సీబీఐ అభియోగపత్రంలో పేర్కొందన్నారు. ఇదే కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది.
'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్'
పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ ఏపీ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి.. దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.
పీఆర్ ఎనర్జీ, పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు కూడా సీబీఐ గడువు కోరింది. విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణతో పెన్నా ఛార్జ్ షీట్ కు సంబంధించిన అన్ని అంశాలపై విచారణను ఈనెల 22కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసు నుంచి కూడా తొలగించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్‌లో శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. హైకోర్టు స్టే పొడిగించినందని ఇండియా సిమెంట్స్ తెలపడంతో విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్యోగాల భర్తీ సహా కృష్ణా జలాలపై చర్చ!