టిక్‌టాక్ మోజు.. అడవిలో దారితప్పిన యువకుడు
టిక్‌టాక్ మోజు ఓ విద్యార్థిని అడవుల పాలు చేసింది. టిక్‌టాక్ చేసేందుకు శేషాచలం అడవులకు వెళ్లి దారితప్పాడో యువకుడు. రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు.
టిక్ టాక్ మోజులో ఓ విద్యార్థిని అడవుల పాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. మురళి అనే విద్యార్థి శేషాచలం అడవులలో టిక్ టాక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి ప్రదేశం కోసం వెదుకుతూ దారి తప్పాడు. రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు. చివరకు వాట్సప్ ద్వారా స్నేహితులకు తానున్న లొకేషన్ షేర్ చేయడంతో బతికి బయటపడ్డాడు. అతని ఆచూకీ కోసం స్నేహితులు పోలీసుల సాయంతో అర్ధరాత్రి అడవికి వెళ్లి రక్షించారు. ఉదయానికి అతడిని అడవి నుంచి బయటకు తీసుకురాగలిగారు. భయంతో మురళికి ఫిట్స్ రాగా.. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.