'టిక్ టాక్' మోజులో పడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వెళ్ళిన ఐదుగురు యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందమైన లోకేషన్లలో వీడియోలు తీసుకునేందుకు కాకినాడ, మాడుగుల, నగరం గ్రామాలకు చెందిన ఐదుగురు యువకులు... నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. మార్గమధ్యంలో వివిధ ప్రాంతాలలో వీడియోలు తీసుకున్నారు.
టిక్‌టాక్ వైపరీత్యం: నాలుగు రోజుల పాటు ఇంటికే రాని యువకులు - TikTok News
'టిక్ టాక్' మోజులో పడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వెళ్ళిన ఐదుగురు యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందమైన లోకేషన్లలో వీడియోలు తీసుకుని... టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేందుకు ఆ యువకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ గుంటూరు జిల్లాకు చేరుకున్నారు.
టిక్‌టాక్ వైపరీత్యం: నాలుగు రోజుల పాటు ఇంటికే రాలేదు
అయితే ఈ విషయం తెలియని తల్లిదండ్రులు... తమ పిల్లలు కనిపించడం లేదని తూర్పు గోదావరి జిల్లా నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతోన్న యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మంగళగిరి ఠాణా నుంచి నగరం పోలీసులకు సమాచారమివ్వగా... వాళ్లు వచ్చి యువకులను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు.
ఇదీ చూడండి :బాలీవుడ్ నటులకు సోషల్ మీడియా సెగ