తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యాచార బాధితురాలిని ప్రత్యేక ప్రదేశానికి తరలించాలి' - hyderabad ccs police

తనపై అత్యాచారం చేశారంటూ పీఎస్​లో ఫిర్యాదు చేసిన యువతి వ్యక్తిగత వివరాలను కొందరు బహిర్గతం చేస్తున్నారని యూత్​ఫోర్స్​ అధ్యక్షుడు అరుణ్​కుమార్​ ఆరోపించారు. ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం సమర్ఫించారు. వెంటనే బాధిత యువతి రెస్క్యూ హోంకు తరలించాలని పోలీసులను కోరారు.

youth force president spoke on rape victim in hyderabad
'అత్యాచార బాధితురాలిని ప్రత్యేక ప్రదేశానికి తరలించాలి'

By

Published : Aug 30, 2020, 3:42 PM IST

తనపై అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధిత యువతి కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు ఆ బాధితురాలి వెనుక నుంచి కొందరు ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమె ఆడియో, వీడియో టేపులను విడుదల చేస్తూ బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటపెడుతున్నారని యూత్ ఫోర్స్​ అధ్యక్షుడు, న్యాయవాది అరుణ్‌ కుమార్ ఆరోపించారు. కేసును పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో అత్యాచారం జరిగిన యువతిని రెస్క్యూ హోంకు తరలించకుండా ఆమె వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశ సంప్రదాయానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అయన డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే ఆ యువతిని ప్రత్యేక ప్రదేశానికి తరలించాలని పోలీసులను కోరారు.

ఇవీ చూడండి: 'బాలికపై అత్యాచారం చేసిన 139 మందిని కఠినంగా శిక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details